కుప్పకూలిన భవంతి, 4మంది మృతి
- February 01, 2017
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాజ్మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుమారు వంద మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిలో నాణ్యతా లోపం వలనే ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ భవనం కూలడంతో సమీపంలోని రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గురైన భవనం సమాజ్వాదీ పార్టీ నేతకు సంబంధించినదని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







