మరో అవకాశం పీఎఫ్ నమోదుకు...
- February 02, 2017
హైదరాబాద్: ఉద్యోగులు, కార్మికులు భవిష్యనిధి సభ్యులుగా ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎఫ్వో 'ఉద్యోగుల నమోదు ప్రచారం- 2017' కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ ఎంఎస్కేవీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2009 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు, కార్మికులుగా చేరి వివిధ కారణాలతో భవిష్యనిధి సదుపాయాలు పొందనివారు, ఆయా యాజమాన్యాలు స్వచ్ఛం దంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు అపరాధ రుసుము కింద ఏడాదికి రూ.1 చొప్పున నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







