అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అగ్రశేణిలో...

- February 04, 2017 , by Maagulf
అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అగ్రశేణిలో...

అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అగ్రశేణిలో నిలబెడతామని సీఈవో కూచిభొట్ల ఆనంద్‌ అన్నారు. రాబోయే పదేళ్లలో భారతీయ కళలను నేర్పించే అగ్రశేణి విశ్వవిద్యాలయాంగా వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. అమెరికాలో భారతీయ సంప్రదాయ కళలను నేర్పించే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శుక్రవారం కాలిఫోర్నియాలోని నిపిటాస్‌ నగరంలో తరగతులను ప్రారంభించారు. డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవన్‌ ప్రాంగణంలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్‌, డిప్లొమో, మాస్టర్స్‌లో చేరిన విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ అకడమిక్‌ ఆఫీసర్‌ చామర్తి రాజు అధ్యక్షత వహించారు.
డాక్టర్‌ కూచిభొట్ట ఆనంద్‌ మాట్లాడుతూ అమెరికాలో ప్రవాసాంధ్రుల సహకారంతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు. వర్సిటీలో ప్రవేశం కోసం www.universityofsiliconandhra.org వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మిలిపిటాస్‌ నగర మేయర్‌ రిచర్డ్‌ ట్రన్‌, డిప్యూటీ మేయర్‌ మార్షా గ్రిల్లీ, కౌన్సిల్‌ మెంబర్‌ బాబ్‌ నునెజ్‌, కౌన్సిల్‌ సభ్యులు రుషి కుమార్‌, కాంగ్రెస్‌ సభ్యులు రోఖన్న, ఆష్‌ కర్లల తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com