తమిళనాడులో చిన్నమ్మ శశికళే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతోంది...
- February 05, 2017
అనుకున్నట్టే అయ్యింది.. తమిళనాడులో చిన్నమ్మ శశికళే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతోంది. చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అధికార అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో ఆమెను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఇదే సమయంలో సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. తమిళనాడులో అధికార పగ్గాలను శశికళ చేపట్టేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన వెంటనే తన రాజీనామాని సమర్పించారు.
ఆమె పేరును మొదట సెల్వం ప్రతిపాదించగానే ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ని కూడా కోరడంతో ఇక శశికళ కొత్త ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆమె వచ్చేవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









