కువైట్ లో క్రికెట్ సందడి

- February 05, 2017 , by Maagulf
కువైట్ లో  క్రికెట్ సందడి

వైఎస్ఆర్ ఛాలెంజర్స్ క్రికెట్‌ కప్ 2017 టోర్నమెంట్ పోటీలు నేడు ముగిశాయి. ఎడారి దేశం కువైట్‌లో తెలుగు వారిని క్రీడల్లో పోత్సహించేందుకు వైఎస్ఆర్‌సీపీ క్రీడా విభాగం ఇంచార్జ్ లక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, సయ్యద్ షఫీపూల్లా, కుప్పిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీ నిర్వహించారు. 20 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్ లో ఆదివారం జరిగిన ఫైనల్స్ లో రెడ్డీస్ రైడర్స్ జట్టు, టైగర్స్ లెవన్స్ జట్టుపై ఘన విజయం సాధించిందని పార్టీ గల్ఫ్ కన్వినర్ ఇలియాస్ బి.హెచ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ వైఎస్ఆర్ సీపీ కువైట్ కన్వినర్ ముమ్మడి బాలిరెడ్డి పాల్గొని విజేత రెడ్డీస్ రైడర్స్ జట్టుకు, రెండవ స్థానంలో నిలిచిన టైగర్స్ లేవన్స్ జట్టుకు బహుమతుల ప్రదానం చేశారు.


బాలిరెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో ఉన్న తెలుగు వారిలో క్రీడా ప్రతిభను గుర్తుంచడంలో వైఎస్ఆర్‌సీపీ కువైట్ ఎప్పుడు ముందుంటుంది అన్నారు. బహుమతులు స్పాన్సర్ చేసిన వైఎస్ఆర్ సీపీ కువైట్ కో కన్వినర్ గోవిందు నాగరాజు, వడ్డిర రాజు సంక్షేమ సంఘం అధ్యక్షులు తురక వెంకటసుబ్బయ్య, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, అధికార ప్రతినిధి, ఇంచార్జ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, బిసి విభాగం ఇంచార్జ్ రమణ యాదవ్, అధికార ప్రతినిది పూలపుత్తూరు సురేష్ కుమార్ రెడ్డి, మల్లి రెడ్డి హనుమంతు రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, అకేపాటి రెడ్డియ్య రెడ్డి, ఎస్ శ్రీనువాసులు రెడ్డిలకు బాలిరెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, గవర్ని౦గ్ కౌన్సిల్ సభ్యులకు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి, యువ జన విభాగం నాయకుడు సయ్యద్ సజ్జాద్, సేవాదళ్ వైస్ ఇంచార్జ్ కె.నాగ సుబ్బారెడ్డి, రావూరి రమణ, ఆకుల చలపతి, షేక్ సబ్దర్, కువైట్ రెడ్డీస్ ఆసోషియేషన్ అధ్యక్షుడు బత్తిన శివారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు చింతల చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు, చాపల శివకుమార్‌, ఏరుకాలువ వెంకటెశ్, భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com