ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నా కళ్యాణ్ రామ్...
- February 06, 2017
తారక్‌తో ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. టాప్ టెక్నీషియన్లని సెలెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా ఓ హీరోయిన్గా చేస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న స్టార్ట్ కానుంది.
ఇక 'ఇజం' తరువాత తను చేయబోయే మూవీ గురించి కూడా కథలు విన్న కళ్యాణ్ రామ్ ఓ స్టోరీ ఫైనల్ చేశాడట. ఇంతకుముందు 'ప్రేమ.. ఇష్క్.. కాదల్', నారా రోహిత్‌తో 'సావిత్రి' లాంటి సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కళ్యాణ్ ఇంతవరకు ట్రై చేయని కొత్త జానర్లో ఈ మూవీ వుండబోతోందట.
తారక్ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయిన తరువాత పవన్‌తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







