ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి చేదువార్త ఇండియాలో...
- February 06, 2017
బెంగళూరు: దేశంలోని చాలామంది యువతీయువకులు బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దేశంలో ఐటీ ఉద్యోగాల కోసం యువతీయవకులు కాళ్లరిగేలా తిరుగుతున్నారని చెప్పకతప్పదు. విద్యా వ్యవస్థలో ప్రమాణాల లేమి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శాపంగా మారింది. క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ లేదని, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా స్కిల్స్ లేవని నిరుద్యోగులను ఐటీ కంపెనీలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయి. ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇండియాలోని ఐటీ కంపెనీలు కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. మానవ సామర్థ్యం కంటే ఆటోమేషిన్ విధానం వైపే ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(బీపీఓ)లో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగుల భవితవ్యం ప్రశార్థకంగా మారింది.
బీపీఓ సేవల్లో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నతస్థాయిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచి, వారికి టెక్నాలజీపరంగా మరిన్ని బాధ్యతలు అప్పగించాలని టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ భావిస్తున్నాయని వరల్డ్ బ్యాంకు నివేదికలో తెలిపింది. దీనివల్ల ఇండియాలోని ప్రతీ 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు, కొత్త ఉద్యోగాల మాట అటుంచితే, కింది స్థాయిలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ ఆటోమెషీన్ నిర్ణయం మరింత ప్రమాదకరంగా మారనుందని నివేదికలో వెల్లడైంది.
ఇండియాలోని ఐటీ కంపెనీలు ఆటోమెషీన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తే కాలేజీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకుని బయటికొచ్చే భవిష్యత్ ఇంజనీర్లకు జాబ్స్ రావడం మరింత కష్టం కానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







