తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది..

- February 06, 2017 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది..

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. సోమవారం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలతో పాటు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరపనున్నారు. .
ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఫిబ్రవరి 20 కాగా, ఫిబ్రవరి 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువును ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. అయితే, మార్చి 9న ఇరు రాష్ట్రాల్లోని ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com