మొదలైన నాగచైతన్య కొత్త చిత్రం
- February 07, 2017
'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగచైతన్య పరిణితి చెందిన నటనతో మంచి మార్కులే వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ఎస్.ఎస్.రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, కీరవాణి తదితరులు హాజరయ్యారు. నాగచైతన్య తన ట్విట్టర్ ఖాతా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 21న నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









