శాంతి చిహ్నం అత్యద్భుతం

- February 09, 2017 , by Maagulf
శాంతి చిహ్నం అత్యద్భుతం

శాంతికి చిహ్నం పావురం.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మార్బుల్‌తో రూపొందించిన ఓ కళాకృతి అందర్నీ ఆకట్టుకుంటోంది. నజీమ్‌ గార్డెన్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు ఖొలూద్‌ అల్‌ షాయెబి, అయూబ్‌ అల్‌ బలుషి దీన్ని రూపొందించారు. 'ల్యాండ్‌ ఆఫ్‌ పీస్‌' పేరుతో ఈ కళాకృతిని రూపొందించామని కళాకారులు తెలిపారు. ఒమన్‌ని పీస్‌ లవింగ్‌ నేషన్‌గా తాము ప్రెజెంట్‌ చేయదలచుకున్నామనీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రపంచ శాంతి కోసం ఎందరో కృషి చేస్తున్నారనీ, శాంతి అనేది మానవ మనుగడకు ముఖ్యమైనదని వారు తెలిపారు. 2.5 మీటర్ల పొడవైన ఈ కళాకృతి విశేషంగా అలరిస్తోంది. 120 గంటలపాటు శ్రమించి దీన్ని రూపొందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com