రంగం సిద్ధం రెండో సినిమాకు...

రంగం సిద్ధం  రెండో సినిమాకు...

రెండో సినిమాకు రంగం సిద్ధం
సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నారు సప్తగిరి ఎక్స్ ప్రెస్ ప్రొడ్యూసర్ డాక్టర్ రవికిరణ్. మాస్టర్ హొమియోపతి అధినేతగా వైద్య రంగంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న రవికిరణ్ ఇప్పుడు సినీ రంగంలో కూడా తన మార్క్ చూపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా హోమ్ బ్యానర్ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మరో సినిమాను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు డాక్టర్ రవికిరణ్. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ ని డాక్టర్ రవికిరణ్ అందుకున్నారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారనే ప్రశంసలు సైతం సప్తగిరి ఎక్స్ ప్రెస్ విషయంలో డాక్టర్ రవికిరణ్ కు దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో రెండో చిత్రాన్ని సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ టీమ్ ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత, డాక్టర్ రవికిరణ్.

Back to Top