భారీకాయురాలైన ఈజిప్టు మహిళ కార్గో విమానంలో వస్తోంది...
- February 10, 2017
ముంబయి : ప్రపంచంలోనే అత్యంత బరువు గల మహిళగా పేరొందిన ఈజిప్టుకు చెందిన ఈమన్ అహ్మద్ బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం శనివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ముంబయికు రానున్నారు. ఈజిప్టుకు చెందిన సరకులు రవాణా చేసే ఎయిర్ బస్ లో ఈమెను ప్రత్యేకంగా తీసుకురానున్నారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల బరువు పెరిగి మంచానికే పరిమితమైన ఈమన్ అహ్మద్ కు సైఫీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. అత్యంత భారీకాయురాలైన ఈమన్ కు చికిత్స చేసేందుకు ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నిర్మించారు. డాక్టర్ లక్డావాలా పర్యవేక్షణలో వైద్యుల బృందం ఈమెకు చికిత్స చేయనుంది. ఆరునెలల పాటు ఈమన్ ముంబయిలో ఉండి చికిత్స పొందుతుందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
ఈమన్ కు వైద్యం చేయడంలో సాయమందించాలని లక్డావాలా చేసిన వినతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







