చరణ్ స్టూడియో హైదరాబాద్ లో...
- February 10, 2017
మెగాస్టార్ 'ఖైదీ నెం.150'తో నిర్మాతగా మారాడు రామ్ చరణ్. నిర్మాతగా తొలి సినిమాతోనే లాభాలు చూశాడు. ఈ జోష్ లోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు. ఇతర హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అఖిల్ అక్కినేని 3వ సినిమాని చరణ్ నిర్మించబోతున్నాడని చెబుతున్నారు.
అయితే, ఈలోగా హైదరాబాద్ లో ఓ స్టూడియో నిర్మించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే తరువాయి. స్టూడియో నిర్మాణాన్ని మొదలెట్టనున్నారు. స్టూడియో చిన్నదైనా.. న్యూ టెక్నాలజితో సర్వ సౌకర్యాలతో సూపర్భ్ గా నిర్మించబోతున్నాడట చరణ్.
ఇక, సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'ధృవ' బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొన్న చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రారంభోత్స్వం జరుపుకొన్న ఈ చిత్రం ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో చరణ్ చెవిటివాడిగా కనిపించబోతున్నాడు. ఆయనకి జంటగా సమంత, రాశీఖన్నాలు జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!







