ఒమాన్ కార్మికులకు ర్యాడిసన్ అండ్ ర్యాడిసన్ బ్లూ హోటల్స్ వారి వారి సహాయం
- September 17, 2015
శ్రామికులకు రోజువారీ అవసరమైన వస్తువులను అందించే ర్యాడిసన్ అండ్ ర్యాడిసన్ బ్లూ హోటల్స్ వారి కార్యక్రమం - 'పార్క్ ఇన్' లేదా 'ద బాక్స్ అప్పీల్' ను మళ్లీ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం 40,000 పెట్టేలను సేకరించి, పంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హోటల్ వారి నుండి ఖాళీ పెట్టేలనుతీసుకుని, వాటిని టీ-షర్ట్, క్యాప్, డిస్పొజబుల్ రేసర్, షేవింగ్ క్రీమ్, డీయోడరెంట్, టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్, ట్యాల్కమ్ పౌడర్, చిన్న హాండ్ టవల్, దువ్వెన, ఆంటీ-బ్యాక్టీరియల్ సోప్ అండ్ ష్యాoపూ లతో నింపి తిరిగి ఇవ్వాలని వారు ఒమాన్ దేశ వాసులకు వారు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కంపెనీలు మరియు ప్రైవేటు సంస్థలు అన్నీ తమ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయని పార్క్ ఇన్ హోటెల్, మస్కట్ మరియు పార్క్ ఇన్ హోటెల్ అండ్ రెసిడెన్స్, దక్మ్ ల క్లస్టర్ జనరల్ మానేజర్ రబీ జెయిన్ తెలిపారు. 2008 సంవత్సరంలో మొదలైన నాటినుండి 90,000 పెట్టేలను పంచిపెట్టామని, సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా పాల్గొంటున్న దక్షణాఫ్రికాతో సహా మధ్య ప్రాచ్యంలోని బహ్రైన్, లెబెనన్, కేటార్, ఈజిప్ట్, ఒమన్ అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ల లోని 24 హోటళ్లు పాల్గొంటున్నాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







