కార్మికులకోసం 'పేమెంట్ ఆఫ్ వేజెస్'
- February 10, 2017
అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెరిగేలా కేంద్రం 'పేమెంట్ ఆఫ్ వేజెస్' చట్టం తీసుకువచ్చిందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్‌తో పాటు కొన్ని కార్మిక సంఘాలు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించాయి. కార్మికుల జీతాలు పెరిగే చట్టాన్ని తీసుకొచ్చినందుకు గాను ఆయనను అభినందించాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరింత సాయం చేస్తుందని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుడికి మొదటి వారంలోనే బ్యాంకు ద్వారా జీతం ఇవ్వాలన్నారు. 2020 నాటికి ప్రతి కార్మికుడికీ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









