నలుగురు ఉగ్రమూక హతం భారీ ఎన్‌కౌంటర్..
- February 11, 2017
జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి.
యారిపుర-ఫ్రిజల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







