8 గంటలు నిర్వీర్యానికి 250 కిలోల బాంబు.. 70 వేల మంది తరలింపు..
- February 11, 2017
అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు పేలకుండా పడి ఉన్న ఆ బాంబు బరువు 250 కేజీలు. కనుగొన్న తర్వాత దాని శక్తిని అంచనా వేస్తే 1.5 కిలోమీటర్ల చుట్టూ ప్రదేశం భస్మమవుతుందని తేలింది. దీంతో ఆ దేశ చరిత్రలో అతిపెద్ద ప్రజా తరలింపునకు రంగం సిద్ధమైపోయింది. ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చేయాలంటే కనీసం 8 గంటలు పడుతుంది.
గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు.
తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు.
బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







