నలుగురు హీరోల 'శమంతకమణి' సినిమా ప్రారంభం
- February 12, 2017
నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్‌బాబు కీలక పాత్రధారులుగా భవ్య క్రియేషన్స పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ తులసీవనంలో ప్రారంభమైన ఈ చిత్రానికి శ్రీను వైట్ల క్లాప్‌నిచ్చారు. ఆనంద్ ప్రసాద్ కెమరా స్విచ్చాన చేశారు. రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఫేస్‌బుక్‌లో జాబ్ చేస్తున్నప్పుడు రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలతో చెయ్యాల్సిన కథ అని పలువురికి చెప్పినప్పుడు తెలుగులో నలుగురు హీరో కలిసి నటించడం సాధ్యం కాదన్నారు. నారా రోహిత, సందీప్ కిషన, ఆది, సుధీర్‌బాబుకు కథ చెప్పగానే అంగీకరించారు.
వినోదం ప్రధానంగా సాగే సినిమా ఇది'' అని అన్నారు. ''త్వరలో సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్తాం'' అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. ఎంగేజింగ్, ఎంటర్‌టైనమెంట్ ఉన్న సినిమా ఇదని హీరోలు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







