విజయవాడ లో భారీ 'విఘ్ననాధుడు'
- September 17, 2015
ఇప్పటి వరకు విజయవాడలోముందు ఎప్పుడూ లేని విధంగా ఒక గణపతి సేవా సంస్థ 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుడుకి షాక్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు పొడుగు 59 అడుగులు అయితే విజయవాడ వినాయకుడు 63 అడుగులుగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మరొక కొత్త విషయం ఏమిటంటే ఈ వినాయక విగ్రహ కమిటీలో 63 మంది కార్య నిర్వహణా సభ్యులు ఉంటే 63 కిలోల బరువు గల లడ్డూతో 63 రోజుల వ్యవధిలో ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించడం రికార్డు. ఈ విగ్రహాన్ని ప్రతిరోజూ రెండులక్షల మంది దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. నిన్న మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ మీడియాలో కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా వినాయకుడి మండపాలకు భక్తులు ఖర్చు పెట్టే ఖర్చు 20 వేల కోట్లు ఉంటుందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం దాకా గణపతి మండపాల సంఖ్య పెరుగుతోంది అంటే దేశంలో వినాయకుడి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









