'తెలుగు కళాసమితి' ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వినాయకచవితి వేడుకలు
- September 18, 2015







బహ్రెయిన్ లో తెలుగు కళాసమితి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయకుడికి పూజలు చేసేందుకు వచ్చిన భక్తులతో ప్రాంగణంలో సందడి నెలకొంది కన్నులపండుగగా తెలుగు వారు అంతా ఒక చోట ఏకమై పూజ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు అన్ని ఏర్పాటులు చెసారు. అలాగే అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మాట్లాడుతూ ఈ పూజ కార్యక్రమము లో పాల్గున్న ప్రతి ఒక్క తెలుగువారి కి వందనం అభివందనం తెలిపారు. వినాయక చవితి తెలుగు వారు ప్రతి పని ముందు మొదట పూజగా చేస్తారు అన్నారు .మన అందరికి ఎటువంటి విఘ్నాలు కలగా కుండా చూడాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. ఉపా ధ్యక్షులు రాజశేఖర్ గారు మాట్లాడుతూ తెలుగు వారు అంతా కలసి ఇంకా ఎన్నో పండుగలు జరుపు కోవాలన్నారు. ఈ కార్య క్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్నిఏర్పాటులు చేసిన కార్యవర్గ సభ్యులు ని ప్రత్యేకముగా అభినందించారు.ఈకార్యక్రమములో కార్యవర్గసభ్యులు అనిల్ గారు మరియు సూర్య,గంగాసాయన్న ,రమణ, శ్రీరాం కుటుంబ సమేతముగా పూజా కార్యక్రమము లో పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









