'ఆకలి అరుపులు'

- September 18, 2015 , by Maagulf

ఓ నవయుగ సమాజమా
నను పాలించే మహాయంత్రమా,,
నువ్ నడిచే దారుల్లో,నే నీ కంటపడలేదా,,
నా కంట ఆకలి నీళ్ళు నూవ్ చూడలేదా?
పథకాల పంపకాల్లో
రిజర్వేషన్ల జీవితాల్లో
ఉపాది హామిల్లో...నే కనబడలేదా
నా ఆకలి అరుపులు...మీకు వినబడలేదా?
నా ఆకలి అరుపుల్లో
నా అంగవైకల్యంలో
నా ఫుట్పాత్ జీవితంలో
తల్లి భారతమాత కనిపివ్వలేదా
నా నీ పరమాత్మను నూవ్ చూడలేదా
లేదా....
భారతమాత బిడ్డవని,నిను నను నడిపించే--
పరమాత్మను నూవ్ మరిచావా,నూవ్ మరిచావా???
కేసియార్ గారు
ఇలాంటి వాళ్ళ బ్రతుకు మారుస్తరని ఆశిస్తూ----
జై హింద్!!
బోలో భారత్ మాతకి జై!!


~~~శేఖర్.మల్యాల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com