4.22 మిలియన్లను చేరిన ఒమాన్ జనాభా-మస్కట్ లో స్థానికులను మించిన ప్రవాసీయుల సంఖ్య
- September 18, 2015
ఆగస్టు 2015 చివరికల్లా, ప్రవాసీయులతో కలిపి ఒమాన్ జనాభా 4.22 మిలియన్లను దాటింది; అందులో - 1.31 మిలియన్లకు పైగా ప్రజలతో మస్కట్ గవర్నరేట్ సింహభాగం ఆక్రమించింది. నేషనల్ సెంటర్ ఫర్ స్ట్యాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI), వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులైతో పోలిస్తే, ఆగస్టు జనాభా 1.3 శాతం పెరిగింది. వీరిలో స్థానికులు 2.35 మిలియన్లు కాగా, ప్రవాసీయుల సంఖ్య 1.86 మిలియన్లు. మస్కట్ లో 8,20,301 మరియు 4,90,525 గా ఉన్న సంఖ్య తో ప్రవాసీయులు స్థానికులను తోసిరాజన్నారు! ఇంకా మొత్తం 11 గవర్నరేట్ లలో,జులై నెలకు 2 శాతం వృద్ధి రేటుతో 13,10,826 ను చేరిన మస్కట్, జనాభాలో అత్యధిక నెలసరి వృద్ధి రేటును నమోదు చేసింది. ఒమాన్ తరువాత,ఉత్తర అల్ బత్త్రినా 6,87,750 తో రెండవ స్థానంలోను, అల్ దాఖిలియా 4,19,444 జనసంఖ్యతో తరువాతి స్థానంలోను ఉన్నాయి. అల్ ఉస్తా మరియు మూసందం, వరుస జనసంఖ్యలు - 41,261 మరియు 41,265 లతో ఆఖరి స్థానంలో ఉన్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







