రీనా నైట్‌క్లబ్‌లో కాల్పులకు పాల్పడ్డ నిందితుని అరెస్ట్...
- February 15, 2017
అంకారా : రీనా నైట్‌క్లబ్‌లో కాల్పులకు పాల్పడ్డ నిందితున్ని అరెస్ట్ చేసినట్టు టర్కీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడి కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 39 మంది మృతి చెందగా, మరో 65 మంది గాయపడ్డారు. కాల్పుల ఘటనతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను పోలీసులు గతనెలలో అరెస్ట్ చేశారు.
మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం ఇస్తాంబుల్‌లో సోదాలు నిర్వహిస్తుండగా 22 ఏండ్ల యువకుడు అనుమానాస్పదితంగా సంచరించడాన్ని గమనించామని చెప్పారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రీనా నైట్‌క్లబ్ కాల్పుల ఘటనతో సంబంధాలున్నట్టు అంగీకరించాడని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







