మార్చి 3 కు 'గుంటూరోడు' వాయిదా..

- February 16, 2017 , by Maagulf
మార్చి 3 కు  'గుంటూరోడు' వాయిదా..

ఈ మధ్య మంచు వారసుల సినిమాలన్నీ వాయిదాలు వేసుకుంటూ ఉండడమే సరిపోతుంది..ఓ పక్క మంచు లక్ష్మి నటించిన లక్ష్మి బాంబ్ రిలీజ్ కోసం పురిటి నొప్పులు పడుతుంటే , తాజాగా మంచు మనోజ్ నటించిన గుంటూరోడు కూడా అలాంటి నొప్పులే పడుతుందని తెలుస్తుంది. ఈ నెల 24 న రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ , తాజాగా ఆ డేట్ ను పోస్ట్ పోన్ చేసారు. మార్చి 3 న 'గుంటూరోడు' రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
 

గత కొంత కాలంగా మనోజ్ కు సరైన హిట్ పడకపోయే సరికి మార్కెట్లో మనోజ్ బిజినెస్ బాగా పడిపోయిందని , అందుకే సినిమా రిలీజ్ కు ఆటంకం పడిందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి డీజే వసంత్ సంగీతం అందించగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com