హైదరాబాద్ చేరిన వంశీ మృతదేహం US నుంచి...
- February 16, 2017
వారం క్రితం క్రితం అమెరికాలో హత్యకు గురైన వంశీచంద్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. అమెరికా నుంచి అర్థరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డెడ్‌బాడీని తీసుకొచ్చారు. అక్కడ వంశీ మృతదేహానికి బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు కిషన్‌రెడ్డి. బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మృతదేహాన్ని స్వగ్రామమైన హసన్‌పర్తి మండలం వంగ పహాడ్‌కు తరలించారు.
వంశీచంద్‌రెడ్డి MS చేసేందుకు అమెరికా వెళ్లాడు. సిలికాన్ వాలీలో చదువును పూర్తి చేసిన వంశీ... చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ స్టోర్‌లో విధులు ముగించుకొని రూమ్‌కు బయలుదేరాడు. ఈలోపు ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. వంశీ వెంటనే కుప్పకూలిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
డ్రగ్స్, జాత్యాంహకారంతోనే వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడ్ని కూడా అరెస్ట్ చేశారు. వంశీ మరణవార్తతో వంగపహాడ్‌లో విషాదం అలుముకొంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అండగా ఉంటాడుకున్న కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడంటూ కన్నీరుమున్నీరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







