ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ...
- February 16, 2017
ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన గురువారం గుంటూరు రైల్వే డివిజన్ పర్యవేక్షణకు వచ్చారు. పగిడిపల్లె వద్ద నుంచి ఆయన నాగిరెడ్డి పల్లె, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెన పల్లి, నల్లపాడు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి వంతెనల పటిష్టతను పరిశీలించారు. రైల్వే క్వార్టర్స్, నూతన ఆర్‌పీ ఎఫ్ భవనాన్ని ప్రారంభించారు. తనిఖీలు, ప్రారంభోత్సవాల అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు-తెనాలి రెండో వరుస రైలు మార్గం పనులను 2018-19లో పూర్తి చేస్తామన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి నూతన మార్గం తొలి దశ 30 కిలోమీటర్ల నిర్మాణాన్ని ఏడిదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరేకునేలా చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళ నిలుపుదల సౌకర్యం సాధ్యం కాదని, అయితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







