మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హాట్ బ్యూటీ..!
- February 18, 2017
టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే రమ్మకృష్ణ, సుహాసిని,నదియా, రాశి లాంటి గ్లామర్ హీరోయిన్లు ఇప్పుడు అత్త, అమ్మ పాత్రలతో తెగ బిజీ అయ్యారు. తాజాగా వీరి బాటలో నడవాలనుకుంటుంది మరో అందాల బ్యూటీ నగ్మ. 90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ అండ్ సెక్సీ భామ నగ్మా అప్పట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో నెం.1 హీరోయిన్‌గా దుమ్మురేపింది. నగ్మా, ప్రభుదేవాతో ప్రేమికుడు చేశాక ఫాలోయింగ్ బాగా పెరిగింది. క్రమేణా కొత్తవారు రావడంతో ఆమె వెనుకంజ వేసింది.
మెగాస్టార్ చిరంజీవి 'ఘరానామొగుడు' చిత్రంతో ఈ అమ్మడు పొగరుబోతు భార్యగా అదుర్స్ అనిపించింది.
తెలుగులో నగ్మ నటించిన ప్రేమికుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాషా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన నగ్మ తర్వాత భోజ్‌పురిలో కూడా చేసింది. ఇక కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న సమయంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నగ్మా రాజకీయాల్లోకి వెళ్లింది.
కాకపోతే ఆ మద్య తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో కనిపించింది. నగ్మ తెలుగు తెరపై కనిపించక దాదాపు 11 ఏళ్లు దాటి పోయింది. 2007 తర్వాత ఆమె ఏ బాషలోనూ సినిమాలు చేయలేదు. లాంగ్ గ్యాప్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగులో ప్రముఖ బేనర్‌లో చేయడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అయితే తల్లిగానో అక్కగానో అనే విషయం త్వరలో తేలనుంది. తర్వలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









