'కబాలి 2' బ్యాక్ డ్రాప్.. !
- February 18, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' క్రియేట్ చేసిన క్రేజ్ గురించి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కబాలి' ఆశించినంత స్థాయిలో ఆడలేదు. అయితే, రజనీ మార్క్ స్టయిల్.. ఆయన అభిమానులని ఆకట్టుకొంది. ఇపుడీ చిత్రం సీక్వెల్ గా కబాలి 2 రెడీ అవుతోన్న విషయం తెలిసిందే.
రంజిత్ పా దర్శకత్వంలోనే కబాలి సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ కి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మే నెల నుంచి ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పుడీ చిత్రం బ్యాక్ డ్రాప్ ఏంటన్నది లీకైంది. 'కబాలి' ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.
అయితే, సీక్వెల్ మాత్రం ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. దీంతో.. దాదాపు 60శాతం షూటింగ్ ని ముంబైలోనే చిత్రీకరించనున్నారు. మిగిలిన 40 శాతం షూటింగ్ ని చెన్నైలో చాలా తక్కువతో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
కబాలి సీక్వెల్ ల్ సూపర్ స్టార్ రజనీ కి జంటగా జతకట్టనున్నది ఎవరు.. ? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







