'బెజవాడ చాలా హుషారుగా ఉంది': నిఖిల్

- February 18, 2017 , by Maagulf
'బెజవాడ చాలా హుషారుగా ఉంది': నిఖిల్

'బెజవాడ చాలా హుషారుగా ఉంది.. ఇక్కడి విద్యార్ధులు ఇంకా హుషారుగా ఉన్నారు' అని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ అన్నాడు. కేబీఎన్‌ కళాశాల కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ 'టెక్నోబెంక్వెట్‌' పేరుతో నిర్వహించిన కంప్యూటర్స్‌ మీట్‌ శనివారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నటుడు నిఖిల్‌ హాజరయ్యాడు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలని విద్యార్థులకు హీరో నిఖిల్‌ సూచించాడు.

విద్యార్ధి జీవితం చాలా కీలకమైందని, తాను ఎడ్యుకేషన్ పూర్తి చేసి గూగుల్‌లో జాబ్‌ సంపాదించానన్నాడు. సినిమా రంగంలోకి అడుగు పెట్టడంతో జాబ్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
మంచి ఉన్నతిని సాధించేందుకు విద్యార్ధులు కష్టపడాలని చెప్పాడు. విద్యార్ధులను కలుసుకోవటం, వారితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నాడు నిఖిల్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com