'ప్రస్థానం' రీమేక్ లో సంజయ్ దత్
- February 19, 2017
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ ఇటీవలే భూమి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడి దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్థానం రిలీజ్ సమయంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన ఉందని ప్రకటించాడు దర్శకుడు. ఇన్నేళ్ల తరువాత ఆ మాట నిలబెట్టుకోబోతున్నాడు. త్వరలోనే సంజయ్ దత్ హీరోగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!









