గీతామాధురి సాంగ్‌ని లాంచ్ చేసిన సునీల్
- February 20, 2017
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ప్రఖ్యాత గాయని గీతామాధురి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భ ంగా సునీల్ మాట్లాడుతూ -"మహిళలకు రక్షణ కల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి.
చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -"గీతామాధురి తనే స్వయంగా పాడి, తనే నటించిన పాటను హీరో సునీల్ ఆవిష్కరించారు. ఇన్నాళ్లు తెరవెనక గీతామాధురి పాటలు వింటున్నాం. ఇప్పుడు తెరపై తను కనిపించబోతున్నారు. ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాం" అని తెలిపారు.
నిర్మాత రజనీ రామ్ మాట్లాడుతూ-"చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.మురుగదాస్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చిత్రమిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు. మార్చి 3న రిలీజవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







