పోలీసు అధికారిణిగా రమ్యకృష్ణ
- February 20, 2017
మూడు దశాబ్దాలకుపైగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకుంటున్న నటి రమ్యకృష్ణ. తెలుగులో ‘అమ్మోరు’తో... తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించిన ‘పడయప్పా’తో ఆమె కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ముఖ్యంగా ‘పడయప్పా’లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను ఎవర్‌గ్రీన్‌గా చెబుతారు సినీ విశ్లేషకులు. ఆ పాత్రలో ఆమె తప్ప మరెవరూ చేయలేరన్నంతగా ఆకట్టుకుంది ఆమె నటన. వివాహం తర్వాత వెండితెరకు కొన్నాళ్లు దూరమైనా... బుల్లితెరపై సందడి చేశారామె. ఇటీవల బాహుబలిలో నటించినప్పటి నుంచి ఆమె పేరు మళ్లీ మార్మోగుతోంది. ప్రస్తుతం ‘శభాష్ నాయుడు’, ‘బాహుబలి - 2’ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
సూర్య హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘తానాసేంద కూట్టం’లోనూ ఆమె నటించనున్నారు. దీనికి దర్శకుడు విఘ్నేష్ శివన్. ఇంతకుముందు విజయ్ సేతుపతి - నయనతార జంట నటించిన ‘నానుం రౌడీదాన్’లో రాధికను సాఫ్ట్ పోలీసు పాత్రలో నటింపజేసిన విఘ్నేష్ శివన్... ఈ చిత్రంలో రమ్యకృష్ణను పవర్ఫుల్ అధికారిణి పాత్రలో చూపనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







