సమాధిలోంచి జయ ఆత్మను రప్పిస్తా..
- February 21, 2017
తమిళనాడు రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మళ్ళీ స్పందించాడు. శశికళ పై సినిమా తీస్తానని ఇదివరకే ప్రకటించిన వర్మ..పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయలలిత ఆత్మ శాంతిస్తుందా అని ప్రశ్నించాడు. తమిళనాడు హారర్ పాలిటిక్స్ కి బెస్ట్ క్లైమాక్స్ ఆలోచించానని, ఈ నాటకాన్ని తట్టుకోలేక జయ ఆత్మ సమాధి నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ అని ట్వీట్ చేశాడు.
బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ..తానేమైనా చిల్లర దొంగనా అని చేసిన వ్యాఖ్యపై స్పందించిన వర్మ-అసలైన నేరం ఎవరిదన్నాడు. బతకడంకోసం ఓ 600 రూపాయలు దొంగిలించిన వాడిదా లేక తమ విలాసవంతమైన జీవితం కోసం తమపై ఎంతో నమ్మకం ఉంచిన ప్రజల్ని కూడా మోసం చేసి 60 కోట్లు కొట్టేసిన దొంగలదా అని అన్నాడు.
కనీసం 60 కోట్లు ఎలా కొట్టేశారో శశికళ నుంచి వీళ్ళు (చిల్లర దొంగలు) పాఠం నేర్చుకోవాలని కోరాడీ ట్వీట్ల మాష్టారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









