ఫైనల్లో సౌతాఫ్రికాపై నెగ్గిన భారత్..

- February 21, 2017 , by Maagulf
ఫైనల్లో సౌతాఫ్రికాపై  నెగ్గిన భారత్..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫెయిర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాపై నెగ్గింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఒక్క వికెట్ తేడాతో మ్యాచ్ గెలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ఛేజింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. 49.5 ఓవర్లకు 243 పరుగుల వద్ద ఉండగా చివరి బంతిని ఎదుర్కొన్న హర్మీత్ కౌర్ విజయవంతంగా రెండు పరుగులు తీసింది.
స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా మహిళల బ్యాటింగ్ : 244/10 భారత మహిళల బ్యాటింగ్ : మెష్రమ్ 59, కమిని 10, డిబి శర్మ 71, వేదా కృష్ణ మూర్తి 31, హర్మీత్ కౌర్ 41(నాటౌట్), ఎస్ పాండే 12, వైద్య 0, ఎస్ వర్మ 0, బిష్ట్ 6, పూనమ్ యాదవ్ 7, ఆర్ఎస్ గైక్వాడ్ 0(నాటౌట్).

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com