ఢిల్లీ విమానాశ్రయం లో 4 కిలోల బంగారం పట్టివేత
- September 20, 2015
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలోని టాయిలెట్లో 4 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్వేస్ విమానం నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో మరో రెండు సంఘటనల్లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు, టర్కీ నుంచి వస్తున్న మరో ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ విమానాశ్రయంలో ఒకే రోజు దాదాపు 10కిలోల బంగారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని వారు పేర్కొన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







