సరికొత్త పథకం బ్రహ్మచారుల కోసం ఏపీ ప్రభుత్వo
- February 23, 2017
ఒంగోలు నగరం: దీపం పథకం కింద బ్రహ్మచారులకు కూడా గ్యాస్ కనెక్షన్లలు అందనున్నాయి. ఇప్పటి వరకు కుటుంబంలో ఒక్కరే పురుషుడు ఉంటే కనెక్షన్ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే ప్రభుత్వం తాజాగా దీపం పథకం మార్గదర్శకాలకు కొంత సడలింపు ఇచ్చింది. మహిళకే కాదు ఒంటరిగా ఉండే పురుషులకు కూడా గ్యాస్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఒకే సభ్యుడు ఉన్న రేషన్ కార్డుల వివరాలను బట్టి వారందరికీ దీపం కింద గ్యాస్ కనెక్షన్లను అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల అమల్లో భాగంగా పురుషులకు కూడా దీపం కనెక్షన్లను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక సభ్యుడు కలిగిన రేషన్ కార్డుదారుల వివరాలను ఆయా ఏరియాలకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు పంపించనున్నారు. వారు దీపం పథకం కింద వీరికి గ్యాస్ కనెక్షన్లను అందించనున్నారు. లక్ష్యాలకు దూరంగా ఉండబట్టే...
జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం దీపం పథకం కింద ఒక సిలిండర్ మాత్రమే అందజేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో దీపం పథకం కింద అందజేసిన గ్యాస్ కనెక్షనలన్నీ మహిళల పేరుతోనే ఉన్నాయి. ఇక నుంచి దీపం పురుషుల పేరుతో కూడా మంజూరు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 2 లక్షలకు పైగా దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. అయితే అధికారులు వీటిని గ్రౌండింగ్ చేయటంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఇలా వెనుకబాటు తనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉంది. గ్రౌండింగ్ ఎంత వేగంగా జరిగినా లక్ష్యాలను చేరుకునే పరిస్థితి అయితే కనిపించటం లేదు. పైగా ఒకే పురుషుడు ఉన్న కుటుంబం నుంచి గ్యాస్ కనెక్షన్ల కోసం అనేక మందిఎదురు చూస్తున్నారు. దీపం కింద కేటాయింపులు అధికంగా ఉండటం , ఏటా అధికారులు లక్ష్యాలను చేరుకోలేక పోవటంతో ఒక్కరే పురుషుడు ఉన్నా ఆ కుటుంబానికి కూడా దీపం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా జిల్లాలో అనేక మంది పురుషులకు కూడా దీపం కింద ప్రయోజనం ఒనగూరనుంది.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







