తెలుగు ఇంజినీర్ మృతి, అమెరికా జాత్యాహంకారంతో ఉగ్రవాదులని సంభోదిస్తూ
- February 23, 2017
కన్సాస్: అమెరికా జాత్యాహంకారంతో ఉగ్రవాదులని సంభోదిస్తూ.. ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఓ తెలుగు ఇంజినీర్ మరణించారు. మృతుడిని శ్రీనివాస్ కూచిబొట్ల(హైదరాబాద్ వాసి)గా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని(వరంగల్ వాసి) తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
కాగా, అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.
'మా దేశం నుంచి వెళ్లిపోండి..' 'ఉగ్రవాదుల్లారా.. ' అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో దుండగుడు దూషించాడు. దీంతో బార్ యాజమాన్యం కలుగజేసుకొని అతడిని బయటకు పంపింది. కాసేపటికే అతడు తిరిగి వచ్చి తుపాకీతో వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఘటనకు సంబంధించి ఆడమ్ పూరింటన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఫిబ్రవరి 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
భార్య కూడా అక్కడే.. శ్రీనివాస్ సౌమ్యుడంటూ స్నేహితులు
కాగా, శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునయనా దుమాల కూడా అదే ప్రాంతంలోని టెక్నాలజీ కంపెనీలో పని చేస్తున్నారు. శ్రీనివాస్ ఎంతో సౌమ్యుడని, అందరితో స్నేహంగా ఉండేవాడని అతని స్నేహితులు చెప్పారు. ఇది ఇలా ఉండగా, శ్రీనివాస్ కుటుంబానికి సాయం అందించేందుకు అమెరికాలోని భారత ఎంబసీ ఇద్దరు అధికారులను కన్సాల్‌కు పంపింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







