అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకి టాటా వారి సూచనలు
- February 25, 2017
విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు.
''అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు. దానివల్ల మీకు తీవ్ర ఇబ్బందులు రావచ్చు'' అని ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు సందేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలపై దాడి అనంతరం అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు, ఆందోళనతో విలవిలలాడుతున్నారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగమ్ కొన్ని ముందు జాగ్రత్తలను సూచించారు. మిగతా విషయాల కన్నా ప్రాణం చాలా విలువైనదని చెప్పారు. క్రింద పేర్కొన్న జాగ్రత్తలను దక్షిణాసియా దేశాలవారు, తెలుగువారు పాటించాలని తెలిపారు.
- బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనకు దిగవద్దు.
- ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి.
- మన మాతృ భాషలో మాట్లాడటాన్ని మనం ఎంతగా ఇష్టపడితే అంతగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరేమో చూసుకోండి.
- ఏకాంత ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా ఉండటం కానీ చేయకండి.
- అత్యవసర పరిస్థితుల్లో 911కు ఫోన్ చేయడానికి సందేహించవద్దు. అటువంటి పరిస్థితుల్లో అధికారులు వచ్చి సహాయపడతారు.
- మీ పరిసరాలను గమనిస్తూ ఉండండి, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే చెప్పండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







