త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్

- February 25, 2017 , by Maagulf
త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26వతేదీన హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు రాష్ట్రపతి రాక సమాచారం శనివారం అందింది. కాగా... ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రపతిని కలిసి అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com