బ్రేకింగ్ న్యూస్ : గుజరాత్‌లో ఐఎస్ అనుమానితుల అరెస్ట్

- February 26, 2017 , by Maagulf
బ్రేకింగ్ న్యూస్ : గుజరాత్‌లో ఐఎస్ అనుమానితుల అరెస్ట్

అహ్మదాబాద్ : దారుణ మారణ కాండతో ప్రపంచాన్ని వణికిస్తున్న పైశాచిక మూక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) భారతదేశానికి కూడా విస్తరించిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్, భావ్‌ నగర్‌ల నుంచి వసీమ్, నయీం అనే ఇద్దరు అన్నదమ్ములను ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఉన్నత విద్యావంతులని తెలుస్తోంది. ఐఎస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారిని అరెస్టు చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో అరెస్టయినవారు ఐఎస్ వీడియోలతో ప్రభావితమైనవారని, వారికి ఆ ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రుజువు కాలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com