మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
- February 27, 2017
కృష్ణా: మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్‌ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది.
దీంతో బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో 40మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్థులు క్షతగాత్రులను రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, పలువురు ప్రయాణికులు ఇంకా బస్సులోనే ఇరుక్కుని ఉండటంతో గ్యాస్ కట్టర్ల సాయంలో బస్సు భాగాలను వేరుచేసి వారిని బయటకు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి చినరాజప్ప ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









