డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని ప్రారంభించిన సిటీ గ్రూప్‌

- February 28, 2017 , by Maagulf
డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని ప్రారంభించిన సిటీ గ్రూప్‌

కువైట్‌: కువైట్లఓ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ని మరింత సౌకర్యంగా తీర్చిదిద్దేందుకోసం డబుల్‌ డ్కెర్‌ బస్సుల్ని ప్రవేశపెట్టినట్లు సిటీ గ్రూప్‌ వెల్లడించింది. ప్రపంచ స్థాయి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసుల్ని తమ వినియోగదారులకు అందించడానికే ఈ బస్సుల్ని తీసుకొస్తున్నట్లు సిఇఓ మరియు వైస్‌ ఛైర్మన్‌ నబిల్‌ అల్‌ జెరాసి చెప్పారు. పర్యావరణానుకూల బస్సులైన ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో జిపిఎస్‌ ట్రాకింగ్‌, వైఫై ఆన్‌ బోర్డ్‌ వంటి సౌకర్యాలతోపాటు, భద్రతాపరంగా అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారాయన. 999 రూట్‌లో ప్రారంభించిన తొలి బస్సుని రెసిడెంట్స్‌ ట్రై చేసి తమ అనుభూతుల్ని తెలపాలని ఆయన కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com