ఇరాన్ జైల్లో మగ్గుతున్న వలసదారులు
- February 28, 2017
మనామా: 30 మంది భారతీయ వలస ఫిషర్‌మెన్‌ని గత ఏడాది ఇరాన్ నేవీ అరెస్ట్ చేయగా, అప్పటినుంచీ వారంతా క్రిష్ ఐలాండ్ జైలులో మగ్గుతున్నారు. 30 మంది ఫిషర్ మెన్‌లో 15 మంది బహ్రెయిన్ కోసం పనిచేస్తున్నారు. మిగతావారంతా దుబాయ్‌కి చెందిన పలు కంపెనీల తరఫున ఫిషింగ్ కోసం పనిచేస్తున్నారు. జార్జ్, వర్గీస్ వర్మా, శ్ర్రీజిత్, ఆంటోనీ జాకోబ్, రవి, సిరిను, కెన్నెడే, సాగర్, క్లౌడిన్, సలెత్ రాజా, విన్సెంట్, ఆంటోనీ, ప్రశాంత్, రాజేష్‌కుమార్ తదితరులు ఇండియాలోని తమిళనాడులోగల కన్యాకుమారి, తిరునల్వేలి, రామనాథురం జిల్లాలకు చెందినవారు. 2016 అక్టోబర్‌లో వీరంతా అరెస్టయ్యారు. మరో 15 మంది 2016, డిసెంబర్‌లో అరెస్టయ్యారు. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలతో ఇరాన్ నేవీ వీరిని అదుపులోకి తీసుకుంది. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అరెస్టయినవారంతా జైళ్ళలో మగ్గుతున్నారని ఇంటర్నేషనల్ ఫిషర్‌మెన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జస్టిన్ ఆంటోనీ చెప్పారు. వారందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, దీనికి సంబంధించి ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







