రోజుకు 100 కోట్ల గంటలు

- February 28, 2017 , by Maagulf
రోజుకు 100 కోట్ల గంటలు

యూట్యూబ్‌.. ఏదైనా ఒక వీడియో చూడటం మొదలు పెడితే చాలు నిమిషాలు.. గంటలు ఇట్టే గడిచిపోతాయి. సమయం అస్సలు తెలియదు. ఒకదాని తర్వాత ఒకటి.. మరొకటి.. ఇంకొకటి. ఇలా చాలా మందికి అనుభవమే. అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో యూట్యూబ్‌ చూసే వారి సమయం మొత్తం కలిపితే ఎన్ని గంటలు అవుతుందో తెలుసా? 100 కోట్ల గంటలు. అవును మీరు విన్నది నిజమే. యూట్యూబ్‌ మాతృసంస్థ అయిన గూగుల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.
‘యూట్యూబ్‌లో రోజుకు బిలియన్‌ గంటల పాటు వీడియోలు వీక్షిస్తున్నారు. ఇది మాకు ఒక మైలురాయి’ అని యూట్యూబ్‌ ఉపాధ్యక్షుడు క్రిస్టోస్‌ గుడ్రో తెలిపారు. ‘ఒక వ్యక్తి బిలియన్‌ గంటలు యూట్యూబ్‌లో వీడియోలు చూడాలంటే లక్ష సంవత్సరాలు పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ల ద్వారా కూడా వీడియోలు వీక్షించే వారి సంఖ్య పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com