ఆధార్‌తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్‌డ్రా
- February 28, 2017
తాజా ఆదేశాల్లో స్పష్టం చేసిన ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: ఆధార్‌తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు అవకాశం కల్పించింది. తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారు ఫారం 10సీతో పాటు ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి కాదని ఈపీఎఫ్‌వో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఫారం 10డి ద్వారా పెన్షన్ నిర్ధారించుకునే చందాదారు మాత్రం ఆధార్ నంబర్‌గానీ ఎన్ రోల్‌మెంట్ స్లిప్‌గానీ సమర్పించాల్సి ఉంటుంది.
చందాదారులకు ఈ వెసులు బాటు కల్పించడం వెనుక కారణాన్ని వివరిస్తూ ఫారం 10సీలో ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయడం వల్ల సెటిల్‌మెంట్ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అందువల్ల దీన్ని కేవలం ఫారం 10డి ద్వారా పెన్షన్ ఫిక్సింగ్‌కి మాత్రమే పరిమితం చేసినట్లు వెల్లడించారు. చందాదారులతో పాటు పెన్షనర్లకు కూడా ఆధార్ తప్పనిసరి చేస్తూ జనవరిలో ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీచేసింది.
అంతే కాకుండా ఈ సంస్థ తరపున అమలవుతున్న అన్ని సామాజిక భద్రతా పథకాల అమలుకు కూడా ఆధార్ తప్పనిసరి చేసింది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 ప్రకారం ఉద్యోగుల పెన్షన్ సెటిల్‌మెంట్‌కు చేసుకునే దరఖాస్తులో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ జనవరి చివర్లో ఆదేశాలు జారీ చేసింది. కాగా చందాదారులతో పాటు పెన్షనర్లకు ఆధార్ సమర్పించేందుకు ఇచ్చిన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి మొదట్లో నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







