తీగలను దొంగిలించిన ఇద్దరు పాకిస్థానీయులకు జైలు శిక్ష

- March 01, 2017 , by Maagulf
తీగలను  దొంగిలించిన ఇద్దరు పాకిస్థానీయులకు  జైలు శిక్ష

దుబాయ్ : గార్డుని గాయపరిచి ఒక నిర్మాణ స్థలం నుండి తీగలను దొంగిలించారని అభియోగంపై ఇరువురు పాకిస్థానీయులకు ఒకొక్కరకి ఆరునెలల జైలుశిక్ష విధించారు. ఉద్యోగం సద్యోగం లేని ఆ ఇరువురు వయస్సు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది. గతంలోనే ఈ వ్యక్తులకు నేరచరిత్ర ఉంది. ఈ సహచరులు జనవరి 28, 2015, వారు అల్ ఖవానీజ్ ,అల్ రాషిదీయహ్ నిర్మాణ స్థలం నుండి 14,000  ధిర్హాంల విలువ చేసే తీగలను తంతులు దొంగిలించారనే నేరం వీరిపై ఆరోపించబడింది. వీరు ఇరువురు దొంగతనంకు వెళ్లిన సమయంలో  సెక్యూరిటీ గార్డు మేల్కొన్నాడు. అయితే వీరు ఒక కర్రతో  ఆ భద్రతకు నియమించబడిన వ్యక్తిని బెదిరించి ఒక పదునైన పరికరంతో అక్కడ ఉన్నతీగలను అపహరించారు.  ఈ దొంగతనం విషయమై  కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. అయితే, వారు దోషులుగా కోర్టు జైలు శిక్షని  పూర్తి చేసిన తర్వాత వారిని దేశ బహిష్కరణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com