దుబాయ్ లో మెరైన్ సందడి
- March 01, 2017
దుబాయ్...ఎల్లప్పుడూ ఎదో ఒక కొత్త ఆకర్షణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించే దేశం.ఇక్కడి విలాసవంతమైన జీవనం అందరికీ తెలిసినదే.దుబాయ్ లో వాటర్ స్పోర్ట్స్ లవర్స్ మరియు వాటర్ టూర్స్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది అంతర్జాతీయ బోట్ షోను నిర్వహిస్తారు.
పలు దేశాల నుండి బోట్ తయారీ యజమానులు తమ కంపెనీలు తయారు చేసే బోట్లను ప్రదర్శించారు.౨౫వ 'అంతర్జాతీయ బోట్ షో' ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 4 వరకు మ. 03:00 గం.ల నుండి రాత్రి 09:30 గం.ల వరకు జరుగును.ఇందులో 60 దేశాలు పాల్గొని తమ మెరైన్ మెళుకువలను ప్రదర్శించనున్నారు. ఈ అరుదైన ప్రదర్శనకు టికెట్ ధర కేవలం 60 దిర్హామ్స్ మాత్రమే. ఈ ప్రదర్శనలో 'అండర్ వాటర్ డ్రోన్' మరియు 'సబ్ మెరైన్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిల్వర్ జిబిలీ పురస్కరించుకొని ఈ ఏడాది ఫెరారీ సూపర్ యాట్‌లను యూఏఈ లోని అతిపెద్ద యాట్ నిర్మాణ సంస్థ 'ఏఆర్టీ మెరైన్' లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ గ్రెగ్ స్టిన్నెర్ మాట్లాడుతూ ఇక్కడ నివసించేవాళ్ళకి ఎంతో అవగాహన ఉందని మరియు మార్కెట్ లో వస్తున్నా కొత్త టెక్నాలజీ మరియు పరికరాల గురించి అవగాహనా ఉండటం వల్ల మాకు కూడా కొత్త ఆలోచనలతో ఇక్కడి కస్టమర్స్ ను ఆకర్షించగల్గుతున్నాం అని అన్నారు. ఈ ప్రదర్శనలో 'ఎమిరేట్స్' వారి 'గల్ఫ్ క్రాఫ్ట్' (యాట్‌లను తయారుచేసే పేరుపొందిన సంస్థ) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ ఎర్విన్ బంప్స్ మాట్లాడుతూ నీతూ యువత రుచికి తగ్గట్టు యాట్‌లను తయారుచేస్తున్నామని, మెరైన్ విభాగం ఎంతో ఆధునికతను సంతరించుకున్నది అని ఈ సిల్వర్ జూబిలీ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ షో లో పాల్గొన్న ఇతర ప్రదర్శకులైన ఐయా నాపా మెరైన్ తాము తయారుచేసిన ప్రతిష్టాత్మక బెంజ్, లంబోర్ఘిని యాట్‌లను ప్రదర్శించారు. సందర్శకులకు 'గూడీ బాగ్స్' ఇచ్చి ఆశ్చర్య పరిచారు నిర్వాహకులు. ఈ ప్రదర్శనలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నిర్విరామంగా కొనసాగిన డీజే సందర్శకులని ఉత్తేజపరిచాయి. ఆర్ట్ గేలరీ ప్రేక్షకులని కట్టిపడేసింది.


తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









