క్వీన్ ఎలిజబెత్‌ ను కలిసిన కమల్

- March 02, 2017 , by Maagulf
క్వీన్ ఎలిజబెత్‌ ను కలిసిన కమల్

సిని పరిశ్రమలో ఓ ఆపుర్వ సంఘటన చోటు చేసుకుంది లోకనాయకుడు కమల్‌హాసన్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలిశారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ఇండో-యూకే కల్చరల్‌ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్‌ 2017 కార్యక్రమంలో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భం క్వీన్‌ ఎలిజబెత్‌ ఆయన కలిశారు. అలాగే ఆమె భారత్‌ పర్యటనను గుర్తుంచుకున్నారు కమల్‌హాసన్‌. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్‌కు రావడాన్ని కమల్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శభాష్‌ నాయుడు' తో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో కమల్ కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. బ్రహ్మానందం ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com