తొలిసారి ఓటమి పాలైన బ్రిటిష్ ప్రధాని థెరెసా
- March 02, 2017
బ్రెగ్జిట్ అనంతరం బ్రిటిష్ ప్రధాన మంత్రి థెరెసా మే మొదటి పరాజయాన్ని రుచి చూశారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటపడుతున్న బ్రిటన్‌లో ఈయూ పౌరుల హక్కుల రక్షణకు హామీనిచ్చే సవరణకు అనుకూలంగా హౌస్ ఆఫ్ లార్డ్స్ ఓటు వేసింది. థెరెసా కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు. ఆ పార్టీకి ఈ సభలో ఆధిక్యత లేదు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 358-256 తేడాతో ఈ సవరణ ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండే ఈయూ జాతీయులను మంత్రులు కాపాడాలని ఈ సవరణ చెప్తోంది. వీరికి నివాస హక్కులు కూడా సమానంగా ఉండేలా ప్రభుత్వం అధికరణ 50 ప్రకారం మూడు నెలల్లోగా ప్రతిపాదనలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈయూ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తున్న డిపార్ట్‌మెంట్ స్పందిస్తూ కామన్స్ సభ సవరణలేవీ లేకుండా ఆమోదించిన బిల్లును సవరించాలని లార్డ్స్ నిర్ణయించడం పట్ల నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. థెరెసా మే మాట్లాడుతూ ఈయూ జాతీయుల హక్కులకు ఇచ్చే ఎటువంటి హామీ అయినా విదేశాల్లో ఉంటున్న బ్రిటన్ వలసదారులను పరిరక్షించే ఒప్పందంలో భాగంగా ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







