మహేష్, కొరటాలశివ కు ఊరట నిచ్చిన హైకోర్టు
- March 02, 2017
ప్రిన్స్ మహేష్ సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు సినిమా స్టోరీ ... 2012 లో స్వాతి మాస పత్రికలో ప్రచురించ బడ్డ "చచ్చేంత ప్రేమ" నవలకు కాపీ అని రచయిత శరత్ చంద్ర మీడియా ముందుకు రావడం కాదు కోర్టు మెట్లు కూడా ఎక్కాడు.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని దాసరి, పరుచూరి వంటి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక మరింత ముదిరింది. దీంతో మహేష్, కొరటాల శివలు న్యాయస్థానం లో హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ అయిన సంగతి విధితమే.. కాగా ఈ సమన్లపై మహేష్, కొరటాల శివ లు వేరు వేరుగా హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు ను నిలిపివేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నెక్స్ట్ చర్యలు ఎలా ఉంటాయి... కొరటాల శివ ఇప్పటికైనా రచయితతో రాజీ పడతాడా...అని ఫిల్మ్ నగర్ టాక్.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ కథ కాపీ వ్యవహారంలో శ్రీమంతుడికి కాస్త ఊరట లభించింది.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









